Krrish-4: హృతిక్ రోషన్ దర్శకత్వంలో 'క్రిష్ 4' 11 d ago

సినిమాల్లో నటనతో అదరగొడుతూ మరొక వైపు నిర్మాతలుగా, దర్శకులుగా వారి ప్రతిభను నిరూపించుకుంటున్న సినీతారలు ఎంతోమంది.అయితే ఇప్పుడు అదే జాబితాలోకి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ చెరబోతున్నారు.విశేష ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్న 'క్రిష్' ఫ్రాంచైజీలో 'క్రిష్ 4' రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం హృతిక్ మెగా ఫోన్ పట్టనున్నట్లు ఆయన తండ్రి రాకేశ్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొదటి రోజు నుంచి కష్టపడుతున్నాడని, ఇప్పుడు ఈ సూపర్ హీరో సాహసాల తదుపరి అధ్యాయాలను తనదైన స్టైల్లో తెరపై చూపించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.